- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బండి సంజయ్‌కి బుద్ధి చెప్పిన రైతులకు ధన్యవాదాలు
దిశ, సూర్యాపేట: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండోరోజు సూర్యాపేట జిల్లాలో పర్యటిస్తూ, గుండాలను తీసుకొచ్చి రైతుల మీద పాశవికంగా జరిపిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రకటించారు. దళితులు, మహిళలు, గిరిజనులు అనే తేడా లేకుండా బీజేపీ గుండాలు దాడులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాసంగిలో తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేస్తుందా? లేదా? అని నిలదీసినందుకు బీజేపీ నేతలు ఇంతటి గుండాయిజానికి పాల్పడ్డారని ఆరోపించారు. నాటి భూస్వాముల దాడులను మరిపించే పద్దతిలో బండి సంజయ్ వెంట వచ్చిన గుండాలు దాడులు జరిపారని తెలిపారు. అంతేగాకుండా.. బీజేపీ గుండాల దాడులను తిప్పికొట్టిన ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతాంగానికి మంత్రి జగదీష్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సూర్యాపేట చైతన్యాన్ని మరోమారు చాటిన మహిళా రైతాంగాన్ని ఆయన అభినందించారు. ఇంతకూ తెలంగాణా ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేస్తుందా? లేదా? అని బండి సంజయ్ చెప్పాలని మంత్రి జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు.