- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పేద కుటుంబానికి మంత్రి జగదీశ్ రెడ్డి ఆపన్నహస్తం
దిశ, నల్లగొండ: కరోనా నేపథ్యంలో తినడానికి తిండి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఓ కుటుంబానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఆపన్నహస్తం అందించారు. సూర్యాపేట మండలం కాసరబాద గ్రామ పంచాయతీ పరిధిలోని వేదిరేవారి గూడానికి చెందిన లింగంపల్లి రాజు 8 ఏండ్ల కిందట చెట్టు పై నుంచి పడ్డాడు. ఈ ఘటనలో నడుము భాగం పూర్తిగా దెబ్బతినడంతో మంచానికే పరిమితమయ్యాడు. కుటుంబ యజమాని ఏం చేయలేని స్థితిలో ఉండటంతో అతని భర్య యశోద కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. లాక్‌డౌన్ వలన పనులు లేకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. తినడానికి తిండి, వేసుకోవడానికి మందులు లేక రాజు, అతని కుటుంబం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఈ విషయం మంత్రి జగదీశ్ రెడ్డి దృష్టికి రావడంతో ఆయన వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి సాయం అందజేయాలని తన క్యాంపు ఆఫీస్ సిబ్బందికి ఆదేశాలిచ్చారు. మంత్రి ఆదేశాలతో ఆదివారం సాయంత్రం అధికారులు స్వయంగా వేదిరే వారి గూడెం వెళ్లి యశోదకు నిత్యావసరాలు, మందులు, కొంత నగదు అందజేశారు. భవిష్యత్‌లో కూడా రాజు కుటుంబానికి అండగా ఉంటామని క్యాంపు ఆఫీస్ సిబ్బంది ద్వారా మంత్రి భరోసా కల్పించారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
tags: lockdown, necessities supply, minister jagadish reddy, help,order to officers