మహిళా హమాలీలను ఆదుకోవడం అభినందనీయం

by  |
మహిళా హమాలీలను ఆదుకోవడం అభినందనీయం
X

దిశ, నల్లగొండ: కరోనా వైరస్ విస్తరిస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో పేదలను ఆదుకోవడానికి అందరూ ముందుకు రావాలని ఇప్పటికే ప్రభుత్వం సూచించింది. దీంతో అనేక మంది ముందుకొచ్చి పేదలను ఆదుకునేందుకు తమవంతు బాధ్యత నిర్వర్తిస్తున్నారు. నల్లగొండ పట్టణ బైక్ మెకానిక్ అసోసియేషన్‌కు చెందిన మెకానిక్‌లకు, మార్కెట్‌లో పని చేస్తున్న మహిళా హమాలీలకు తన తండ్రి రాంమూర్తి జ్ఞాపకార్ధంగా టీఆర్ఎస్ నాయకుడు ఉప్పల ఆనంద్ నిత్యావసరాలు, బియ్యం, కూరగాయల పంపిణీ చేశారు. దీంతో ఆయన్ను మంత్రి జగదీశ్ రెడ్డి అభినందించారు. పట్టణంలో మంత్రి క్యాంపు కార్యాలయంలో ఈ సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి జగదీష్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. పేదలను ఆదుకునేందుకు ముందుకొస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పయిన బైక్ మెకానిక్‌లు, హమాలీలను ఆదుకున్న ఆనంద్ కుటుంబ సభ్యులను అభినందించారు. అందరూ తోటివారి పట్ల సేవాగుణంతో ఉండాలని, పేదలను ఆదుకోవడంలో ప్రభుత్వం చేస్తున్న క‌ృషికి తోడు దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకురావాలని కోరారు.


Next Story

Most Viewed