- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎస్సీ వర్గీకరణపై బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: కూటమి అధికారంలోకి రాగానే ఎస్సీ వర్గీకరణ చేస్తామని హిందూపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ హామీ ఇచ్చారు. నెల్లూరు జిల్లా గుడ్లూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన ఎస్సీల సంక్షేమాన్ని సీఎం జగన్ విస్మరించారన్నారు. రాళ్లపాడు ప్రాజెక్టు ఎడవకాలువ పనులు పూర్తి చేస్తామన్నారు. అభివృద్ధి కావాలో.. అరాచకాలు కావాలో ప్రజలే తేల్చుకోవాలన్నారు. స్వర్ణం యుగం కావాలా అని, రాతి యుగం కావాలా అని ప్రశ్నించారు. ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖలో రుషికొండను నాశనం చేసి ఇప్పుడు నెల్లూరు వచ్చారని విమర్శించారు. పోలవరాన్ని పూర్తి చేయలేకపోవడమే కాకుండా గోదావరిలో ముంచేశారని ఆరోపించారు. వైసీపీ సిద్ధం ప్రచార హోర్డింగులకు రూ.1600 కోట్లు ఖర్చు పెట్టారని మండిపడ్డారు. అప్పులు, ఆత్మహత్యలో ఏపీది మొదటి స్థానమని ఎద్దేవా చేశారు. గంజాయి సరఫరాలో రాష్ట్రం ప్రథమ స్థానమని బాలకృష్ణ విమర్శించారు.