BREAKING: ఏసీబీ వలలో నీటిపారుదల శాఖ డీఈ.. రూ.4 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత

by Disha Web Desk 1 |
BREAKING: ఏసీబీ వలలో నీటిపారుదల శాఖ డీఈ.. రూ.4 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ కార్యాలయాల్లో లంచగొండులను సమూలంగా నిర్మూలించేందుకు ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకుంటుంది. ఈ మేరకు లంచం తీసుకున్నవారు ఎంతటి వారైనా వదిలిపెట్టకూడదంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి పూర్తి అధికారాలను సైతం కట్టబెట్టింది. ఈ నేపథ్యంలో నగర పరిధిలో నీటిపారుదల శాఖలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా విధులు నిర్వర్తిస్తున్న పవన్ ఏసీబీ వలలో చిక్కాడు. ఉప్పల్‌లోని ఓ వాణిజ్య భవనానికి ఎన్‌వోసీ ఇచ్చేందుకు గాను యజమాని నుంచి రూ.5 లక్షల లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు రూ.4 లక్షలు ఇస్తానంటూ ఒప్పుకుని ఏసీబీ అధికారులు ఆశ్రయించాడు. ఈ క్రమంలో ఇంజనీర్ పవన్‌, బాధితుడి నుంచి రూ.4 లక్షలు లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

Click Here For Twitter Post..



Next Story

Most Viewed