- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఐదో దశ’కు మొదలైన నామినేషన్ల స్వీకరణ
దిశ, నేషనల్ బ్యూరో: ఐదో దశ లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం నుంచి మొదలైంది. ఇందుకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఉదయమే విడుదల చేసింది. దేశంలో మొత్తం ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తొలి దశ, రెండో దశ ఎన్నికలు పూర్తవ్వగా, మూడు, నాలుగో దశకు నామినేషన్ల స్వీకరణ సైతం ముగిసింది. ఈ క్రమంలోనే తాజాగా ఐదో దశ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ దశలో నామినేషన్ల దాఖలుకు వచ్చే నెల 3 చివరి తేది. అదే నెల 4న నామినేషన్లను పరిశీలించనుండగా, 6వ తేదీన ఉపసంహరణకు అవకాశమిస్తారు. ఈ దశలో దేశంలోని 8 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతా(యూటీ)ల్లోని 49 స్థానాలకు మే 20న పోలింగ్ జరగనుంది. ఇందులో బిహార్‌లోని 5 స్థానాలు, జార్ఖండ్‌లోని 3 నియోజకవర్గాలు, మహారాష్ట్రలోని 13 సీట్లు, ఒడిశాలోని 5 స్థానాలు, యూపీలోని 14 సీట్లు, బెంగాల్‌లోని 7 నియోజకవర్గాలతోపాటు జమ్మూ కశ్మీర్, లడఖ్‌లోని ఒక్కో స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి.