Manipur: మణిపూర్‌లో మళ్లీ హింస.. ఫూట్‌హిల్ గ్రామానికి అదనపు బలగాలు పంపిన కేంద్రం

by vinod kumar |
Manipur: మణిపూర్‌లో మళ్లీ హింస.. ఫూట్‌హిల్ గ్రామానికి అదనపు బలగాలు పంపిన కేంద్రం
X

దిశ, నేషనల్ బ్యూరో: అల్లర్లతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur) మరోసారి భారీ కాల్పులతో దద్దరిల్లింది. రాష్ట్రంలోని ఇంఫాల్ ఈస్ట్ (Imphal east) , కాంగ్‌పోక్పి (Kangpokpi) జిల్లాల మధ్య ఉన్న అంతర్-జిల్లా సరిహద్దు గ్రామమైన ఫూట్‌హిల్ (Foot hill) గ్రామంలో బుధవారం కాల్పులు జరిగినట్టు భద్రతా వర్గాలు తెలిపాయి. కొండల పై నుంచి సాయుధ వ్యక్తులు ప్రజలపై కాల్పులకు తెగపడ్డట్టు పేర్కొన్నాయి. ఈ ఘటన అనంతరం ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్టు తెలుస్తోంది. అయితే కాల్పుల్లో గాయపడ్డవారి గురించి స్పష్టమైన సమాచారాన్ని వెల్లడించలేదు. హింసాత్మక పరిస్థితుల దృష్ట్యా ప్రభావిత గ్రామమైన ఫూట్‌హిల్‌కు భారీగా భద్రతా బలగాలను పంపినట్టు తెలిపారు. కొద్ది రోజులుగా సాధారణ పరిస్థితులు నెలకొన్న రాష్ట్రంలో క్రిస్మస్ రోజే కాల్పులు జరగడంతో ఆందోళన నెలకొంది. కాగా, గతేడాది మే నుంచి మణిపూర్‌లో కుకీ (Kukee), మైతీ (Maitee) తెగల మధ్య జాతి హింస నెలకొన్న విషయం తెలిసిందే. ఈ హింస కారణంగా ఇప్పటి వరకు 250 మందికి పైగా మరణించగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు.

Advertisement

Next Story

Most Viewed