- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TG Police: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన.. ఫేక్ వీడియోలపై పోలీసుల స్ట్రాంగ్ వార్నింగ్
దిశ, వెబ్‌డెస్క్: పుష్ప-2 (Pushpa-2) ప్రిమియర్ షో (Premiere Show) సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ (RTC Cross Road)లోని సంధ్య థియేటర్ (Sandhya Theatre) వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ క్రమంలోనే తొక్కిసలాట ఘటనపై సోషల్ మీడియా (Social Media)లో ఎవరైనా వీడియోలతో తప్పుడు పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీసులు (Hyderabad Police) స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ ఓ ప్రకటన విడుల చేశారు. వాస్తవాలు ప్రజలు (Public), మీడియా (Media)కు తెలియాలనే తొక్కిసలాట ఘటనను సీన్ బై సీన్ వివరిస్తూ వీడియోను రిలీజ్ చేశామని అన్నారు.
ఇదే అదునుగా చేసుకుని ఎవరైనా ఫేక్ వీడియోలను స్ప్రెడ్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని వారు హెచ్చరించారు. నటుడు అల్లు అర్జున్ (Allu Arjun) రాక ముందే తొక్కిసలాట జరిగినట్లుగా కొందరు తప్పుడు వీడియోలను పోస్ట్ చేసిన అంశం తమ దృష్టికి వచ్చిందని అన్నారు. ఉద్దేశపూర్వకంగా పోలీసులను బ్లేమ్ చేస్తూ వీడియోలు పెడితే ఆ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తామని పేర్కొన్నారు. ఫేక్ వీడియో (Fake Video)లకు సంబంధించి ఎవరి దగ్గరైనా అధారాలు, సమాచారం ఉంటే డయల్ 100కు సమాచారం అందజేయాలని సిటీ పోలీసులు తెలిపారు.