- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AIMIM : ఢిల్లీ అల్లర్ల కేసు నిందితుడి కుటుంబంతో మజ్లిస్ నేత భేటీ
దిశ, నేషనల్ బ్యూరో : 2020 సంవత్సరంలో ఢిల్లీలో జరిగిన అల్లర్ల(Delhi Riots) కేసులో నిందితుడిగా ఉన్న షారుఖ్ పఠాన్‌కు చెందిన కుటుంబ సభ్యులతో మజ్లిస్(AIMIM) పార్టీ ఢిల్లీ విభాగం అధ్యక్షుడు డాక్టర్ షోయబ్ జమాయి భేటీ అయ్యారు. ఈసందర్భంగా వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీ అల్లర్ల సమయంలో ఓ పోలీసు సిబ్బందిపైకి షారుఖ్ పఠాన్ తుపాకీని ఎక్కుపెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసింది. ఈకేసులో షారుఖ్ ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్నాడు. ఈ కేసు విచారణకు సంబంధించిన వివరాలను కూడా షారుఖ్ కుటుంబ సభ్యులను డాక్టర్ షోయబ్ జమాయి అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. షారుఖ్ పఠాన్ కుటుంబం ఢిల్లీలోని సీలం పూర్ అసెంబ్లీ స్థానం పరిధిలో నివసిస్తోంది.
ఈ సమావేశం అనంతరం ఢిల్లీ మజ్లిస్ చీఫ్ షోయబ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చని ఆయన పేర్కొన్నారు. సీలంపూర్ అసెంబ్లీ స్థానంలో ముస్లిం మైనారిటీలు ఎక్కువని, అక్కడి ప్రజలకు మంచి నాయకుడు కావాలన్నారు. షారుఖ్ పఠాన్‌కు అసెంబ్లీ టికెట్ కేటాయింపుపై మజ్లిస్ పార్టీ అధిష్టానమే తుది నిర్ణయం తీసుకుంటుందని షోయబ్ స్పష్టం చేశారు. ‘‘అరవింద్ కేజ్రీవాల్ ఆదేశాలతోనే షారుఖ్‌పై కేసు నమోదైంది. ఈవిషయాన్ని అతడి తల్లి నాతో చెప్పారు. ఈవిషయాన్ని షారుఖ్ కూడా మర్చిపోలేడు’’ అని డాక్టర్ షోయబ్ జమాయి వ్యాఖ్యానించారు. షారుఖ్ పఠాన్‌కు సంబంధించిన కేసులో విచారణ సక్రమంగా జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఇక ఈ సమావేశాన్ని ఢిల్లీ బీజేపీ నేత విజేందర్ గుప్తా తప్పుపట్టారు. ఢిల్లీలో శాంతి, సామరస్యాలకు విఘాతం కలిగించేందుకు మజ్లిస్ పార్టీ యత్నిస్తోందని ఆరోపించారు. ఢిల్లీని ముక్కలు చేయాలని మజ్లిస్ పార్టీ చూస్తోందన్నారు.