- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గంజాయి విక్రయిస్తున్న యువకుల అరెస్ట్..
దిశ,చేర్యాల: చేర్యాల ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్న యువకులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించనున్నట్లు చేర్యాల సీఐ ఎల్. శ్రీను తెలిపారు.బుధవారం చేర్యాల సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చేర్యాల ఎస్సై నీరేష్ కు వచ్చిన నమ్మదగిన సమాచారంతో పట్టణ శివారులో గంజాయి విక్రయిస్తున్న నలుగురు యువకులు అదుపులోకి తీసుకొని విచారించగా,వారు మండల కేంద్రానికి చెందిన రాసురి నవీన్ తో పాటు మండల పరిధిలోని చుంచనకోట గ్రామానికి చెందిన ఏశబోయేన కరుణాకర్, పొన్నబోయిన పవన్, చిట్కూరు శ్రవణ్ అనే యువకులుగా గుర్తించామన్నారు.
వీరంతా ముఠాగా ఏర్పడి హైద్రాబాద్ లో పలు వైన్ షాపుల ముందు చుడువ అమ్ముతుంటారని, వీరు ధూల్ పేట లో గంజాయి కొనుగోలు చేసి చేర్యాల ప్రాంతంలో యువకులకు విక్రయిస్తున్నారని తెలిపారు. వీరి వద్ద నుండి 50 గ్రాముల గంజాయి ఒక ట్రాలీ ఆటో, స్కూటీ ,నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పిల్లల ప్రవర్తనను,కదలికలను గమనించాలని తల్లిదండ్రులకు సూచించారు.ఈ సమావేశంలో కానిస్టేబుల్ హనుమంత్,గౌతమ్ లు పాల్గొన్నారు.