‘నట్టేట ముంచారు’.. సీఎం జగన్‌పై విమర్శల వర్షం కురిపించిన YS షర్మిల

by Satheesh |   ( Updated:2024-04-26 17:18:16.0  )
‘నట్టేట ముంచారు’.. సీఎం జగన్‌పై విమర్శల వర్షం కురిపించిన YS షర్మిల
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం జగన్‌పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం తిరువూరు సభలో ఆమె మాట్లాడుతూ.. జగన్ సీఎం అయ్యాక ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాను మరిచిపోయారని.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో ఈ సీఎంకు తెలియదా.. ప్రత్యేక హోదా వస్తే ఎన్ని ఉద్యోగాలు వస్తాయో తెలియదా అని ప్రశ్నల వర్షం కురిపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చి ఐదేళ్లు అయ్యింది.. ప్రత్యేక హోదా ఊసే లేదని.. మన బిడ్డల భవిష్యత్ గురించి జగన్ ఆలోచించట్లేదని విమర్శించారు.

రాష్ట్రానికి మూడు రాజధానులు అన్నారు.. చివరికి ఒక్కటి లేకుండా చేశారని ఎద్దేవా చేశారు. మన రాజధాని ఏంటీ అంటే చెప్పలేని పరిస్థితి తీసుకొచ్చారని అసహనం వ్యక్తం చేశారు. జగన్‌ను నమ్మి గెలిపిస్తే నట్టేట ముంచారని.. ఇకనైనా మీ చేతిలో ఉన్న ఓటు అనే ఆయుధాన్ని ఆలోచించి సరైన వ్యక్తికి వేయాలని పిలుపునిచ్చారు. జగన్ ఐదేండ్ల పాలనలో రాష్ట్రంలోని రైతులంతా అప్పుల పాలయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అన్నారు .. ఏమైందని ప్రశ్నించారు. ఒక్క ఏడాదైనా రైతుల కోసం రూ.3 వేల కోట్లు పక్కన పెట్టారని అని నిలదీశారు.

పంట నష్టపోయిన రైతులను ఆదుకున్న పరిస్థితి లేనే లేదని ఫైర్ అయ్యారు. ప్రతి సంక్రాంతికి జాబ్ క్యాలెండర్ అన్నారు.. ఏమైందని క్వశ్చన్ చేశారు. ఐదు సంక్రాంతిలొచ్చాయి.. జాబ్ క్యాలెండర్ లేదు కానీ కోడి పందేలు జరిగాయని ఎద్దేవా చేశారు. ఐదేళ్లు ఉద్యోగాలు ఇవ్వకుండా ఇప్పుడు మేల్కొంటారా..? కుంభకర్ణుడు అయిన ఆరు నెలలకొకసారి నిద్ర లేస్తాడు.. మరీ జగన్ ప్రభుత్వం ఎందుకు మేల్కొనలేదని ఫైర్ అయ్యారు. మళ్లీ ఇప్పుడు ఎన్నికల రావడంతో వచ్చి ఓట్లు అడుగుతున్నారన్నారు. ఇప్పుడు సిద్ధం అంటూ వస్తున్నారెందుకు..? బహుశా ఓడిపోవడానికి సిద్ధమేమో అని సెటైర్ వేశారు.

Advertisement

Next Story

Most Viewed