Pawan: వైసీపీని ఇంటికి పంపించే సమయం ఆసన్నమైంది: పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

by Shiva |
Pawan: వైసీపీని ఇంటికి పంపించే సమయం ఆసన్నమైంది: పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీని ఇంటికి పంపించే సమయం ఆసన్నమైందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన కోససీమ జిల్లా మకలిపురం ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనసేన తరఫున గెలిచి వైసీపీలో చేరిన రాపాక వరప్రసాద రావు 5 ఎకరాల్లో ఇళ్లు కట్టుకున్నారని ఆరోపించారు. రైతుల కష్టాలను నియోజకవర్గం ఎమ్మెల్యే ఏనాడు పట్టించుకోదని మండిపడ్డారు. డ్రైవర్‌ను చంపి ఎమ్మెల్సీ అనంతబాబు డోర్‌ డెలివరీ చేశారని ఆ విషయాన్ని జనం అంత సులువుగా మరిచిపోరని అన్నారు. ఇప్పటి వరకు ఆ ఎమ్మెల్సీపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. ఇదేక్కడి న్యాయం అంటూ ప్రశ్నించారు. వైసీపీని ఇంటికి పంపించే సమయం ఆసన్నమైందని.. రాష్ట్రంలో ఎక్కడ చూసినా మార్పు కనిపిస్తుందని పేర్కొన్నారు. ‘ఆంధ్రా ప్రజరారా ఊపిరి తీసుకోండి.. రాష్ట్రంలో ప్రభుత్వం మారబోతోందని’ అని పవన్ అన్నారు.

Advertisement

Next Story