- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తుంగతుర్తిలో బస్సు డిపో ఏర్పాటు చేయాలి
దిశ,తుంగతుర్తి: తుంగతుర్తి మండల కేంద్రంలో ఆర్టీసీ బస్సు డిపో ఏర్పాటు చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ కోతి రాములు గౌడ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శనివారం ఆయన తుంగతుర్తి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దశాబ్దాల కాలం నుంచి బస్సు డిపో ఏర్పాటుపై ఇక్కడి ప్రజల్లో ఆశలు ఉన్నాయని వివరించారు. ముఖ్యంగా తుంగతుర్తి ప్రాంతానికి చెందిన స్వర్గీయ ఆకారపు సుదర్శన్ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ చైర్మన్ గా ఉన్న కాలంలో ఆర్టీసీ డిపో ఏర్పాటు చేసే ప్రతిపాదనతో పాటు దీనికి సంబంధించిన పలు కార్యక్రమాలు కూడా జరిగాయని ఆయన తెలిపారు. కాగా ప్రస్తుతం 45 కి.మీ దూరంలో ఉన్న సూర్యాపేట ఆర్టీసీ డిపో పైనే తుంగతుర్తి ప్రాంతం ఆధారపడి ఉందని తెలిపారు. అన్ని రంగాల అభివృద్ధిలో వెనకబాటుకు గురైన తుంగతుర్తి ఆర్టీసీ డిపో ఏర్పాటు వల్ల అభివృద్ధి చెందే అవకాశం ఉందని ఆయన తెలిపారు. దీనిపై అన్ని పక్షాలనేతలు కలిసి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.