- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇది విన్నారా.. ? అక్కడ మనుషులు పర్వతాన్ని తింటారు!!
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో టెక్నాలజీ(Technology) యమ స్పీడ్‌గా దూసుకుపోతుంది. మనుషుల ఆలోచనలు కూడా అంతే వేగంగా ఉన్నాయి. ఇలాంటి జనరేషన్‌లో కొన్ని వింతలు విడ్డూరాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఈ భూమి మీద చాలా మందికి తెలియని అనేక ప్రదేశాలు ఉన్నాయి. ఒకవేళ తెలిస్తే ముక్కున వేలు వేసుకుని అవునా? నిజమా? అంటూ వింతతో పాటు చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. అయితే విషయానికొస్తే.. ఓ చోటున్న పర్వతం అందంతో పాటు రుచిలో కూడా అద్భుతమట. ఏంటి పర్వతం తినడం ఏంటని షాక్ అవుతున్నారా? అవును మీరు విన్నది నిజమే.. మరీ ఆ పర్వతం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ పర్వతం ఉండేదాన్ని ద్వీపం అంటారు. జంబూద్వీప్(Jambudweep) నైరుతి విభాగంలోని ఇరాన్(Iran) తీరానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో పెర్షియన్ గల్ఫ్(Persian Gulf) నీలి జలాల మధ్య ఉంటుందట. హార్ముజ్ అని పిలువబడే ఈ ద్వీపం చూడానికి ఎంతో బాగుంటుంది. ఇక్కడ రంగురంగుల పర్వతాలు, బంగారు కాలువలు, బ్యూటిఫుల్ ఉప్పు గనులు.. అనేక అద్భుతమైన ప్లేసెస్ ఉంటాయట. ఖనిజాలు(Minerals), ఉప్పు దిబ్బలు (salt reefs)అగ్నిపర్వత శిలలు(volcanic rocks).. ఈ ద్వీపాన్ని ఎంతో అందంగా మార్చాయట.
ఈ ద్వీపం గురించి మరో ఇంట్రెస్టింగ్ విషయం కూడా ఉంది. ఇక్కడున్న పర్వతం ప్రపంచంలో తీనదగిన ఏకైక పర్వతం అట. ఇది మందపాటి ఉప్పు పొరలతో ఏర్పడి ఉంటుంది. ఈ ద్వీపం పలు రకాల ఖనిజాల కారణంగా నేల కూడా కారంగా ఉండటంతో పాటు.. దీన్ని కూరల్లో మసాలాగా వాడుతుంటారట. అంతేకాకుండా అక్కడి జనాలు ఎర్రమట్టిని పచ్చడిగా చేసుకుంటారట. వీటితోపాటు ఈ మట్టితో స్థానిక కళాకారులు పెయింటింగ్ కోసం, బట్టలకు కలర్ వేసుకునేందుకు యూస్ చేస్తారట.