ముగ్గురు అనాథ పిల్లలను దత్తత తీసుకున్న ప్రధానోపాధ్యాయురాలు..

by Sumithra |
ముగ్గురు అనాథ పిల్లలను దత్తత తీసుకున్న ప్రధానోపాధ్యాయురాలు..
X

దిశ, సంగారెడ్డి అర్బన్ : ఆర్థిక స్తోమత సరిగా లేక కన్న పిల్లలను కొంతమంది తల్లిదండ్రులు దూరం చేసుకుంటున్న ఘటనలను మనం చూశాం. కానీ నిరుపేద కుటుంబానికి చెందిన అనాధ పిల్లలను ఓ ప్రధానోపాధ్యాయురాలు తన అక్కున చేర్చుకుంది. పిల్లల విద్యాభ్యాసం మొత్తం ఖర్చులు తానే భరిస్తానంటూ ఆ ముగ్గురుని దత్తత తీసుకుంది. సంగారెడ్డి జిల్లా కంది లక్ష్మీ నగర్ లోని ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్న సాయితేజ, తేజ, విజ్ఞేశ్వేర్ చాలా పేద వాళ్ళు.

వారి ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని పాఠశాల ప్రధానోపాధ్యాయులు లీలావతి ఆ ముగ్గురు పిల్లలను ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తయ్యే వరకు దత్తత తీసుకున్నారు. వాళ్ళ విద్యాభ్యాసం పూర్తయ్యే వరకు మొత్తం ఖర్చులు భరిస్తానని ఈ సందర్భంగా లీలావతి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు సోమ శేఖర్, రాష్ట్ర కౌన్సిలర్ కమ్రొద్దిన్, మండల అధ్యక్షులు సిద్దేశ్వర్, పాఠశాల ఉపాధ్యాయులు ప్రమీల, చంద్రమోహన్ లు పిల్లలను అక్కున చేర్చుకున్న లీలావతిని అభినందించారు. ఆమె సామాజిక బాధ్యత అందరికీ ఆదర్శనీయమని వారు కొనియాడారు.

Advertisement

Next Story

Most Viewed