సెయిలింగ్‌లో నేత్రకు పారిస్ ఒలింపిక్స్ కోటా

by Dishanational3 |
సెయిలింగ్‌లో నేత్రకు పారిస్ ఒలింపిక్స్ కోటా
X

దిశ, స్పోర్ట్స్ : భారత మహిళా సెయిలర్ నేత్ర కుమానన్ సెయిలింగ్‌లో మహిళల డింగీ(ఐఎల్‌సీఏ 6 క్లాస్) విభాగంలో పారిస్ ఒలింపిక్స్ కోటా సాధించింది. ఫ్రాన్స్‌లో శుక్రవారం జరిగిన లాస్ట్ చాన్స్ రెగట్టా ఒలింపిక్ క్వాలిఫయర్స్ టోర్నీలో ఆమె బెర్త్ దక్కించుకుంది. ఈ ఈవెంట్‌లో నేత్ర 67 నెట్ పాయింట్లు సాధించి ఐదో స్థానంలో నిలిచింది. టాప్-3లో నిలిచిన వారికి మాత్రమే ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తారు. కానీ, ఎమర్జింగ్ నేషన్స్ ప్రొగ్రామ్(ఈఎన్‌పీ)లో ఇంకా కోటా పొందని వారిలో అత్యుత్తమ ప్రదర్శన చేయడంతో నేత్రకు ఒలింపిక్స్ కోటా దక్కింది. ఈఎన్‌పీ ప్రొగ్రాం ద్వారా వరల్డ్ సెయిలింగ్ గవర్నింగ్ బాడీ సెయిలింగ్‌లో తక్కువ ఆదరణ కలిగిన దేశాలకు చెందిన అథ్లెట్లు అత్యున్నత స్థాయిలో ప్రభావం చూపడానికి సహాయం చేస్తుంది. సెయిలింగ్‌లో భారత్‌కు ఇది రెండో ఒలింపిక్స్ కోటా. జనవరిలో విష్ణు శరవణన్ పురుషుల డింగీలో పారిస్ విశ్వక్రీడలకు అర్హత సాధించాడు.



Next Story

Most Viewed