- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్‌లో పెద్ద జోకర్ రాహుల్ గాంధీ.. కేసీఆర్‌ను మించిన మోసగాడు రేవంత్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్
దిశ, మహబూబ్‌నగర్ బ్యూరో/కోస్గి: కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ ఓ పప్పు, పెద్ద జోకర్.. అలాంటి వ్యక్తి ప్రధాని అయితే దేశం పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్‌నగర్ పార్లమెంటు పరిధిలో బీజేపీ అభ్యర్థి డీకే అరుణకు మద్దతుగా కొడంగల్, కోస్గి పట్టణాలలో నిర్వహించిన రోడ్ షో, కార్నర్ మీటింగ్‌లకు రాజాసింగ్ పాటు కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజాసింగ్ మాట్లాడుతూ.. పదేళ్ల కాలంలో నరేంద్ర మోడీ సారథ్యంలో బీజేపీ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి ప్రపంచ దేశాలలో మన దేశం గర్వపడేలా చేసిందని తెలిపారు.
ఈ సమయంలో మోడీ ప్రభుత్వంపై ఒక్క అవినీతి మరక కూడా లేదని అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతిరోజూ ఓ అవినీతి వెలుగులోకి వచ్చిందని గుర్తు చేశారు. వాళ్ల పరిపాలన కాలంలో ఏకంగా రూ.12 లక్షల కోట్ల రూపాయలు లూటీ అయ్యాయని ఆరోపించారు. కాంగ్రెస్ వాళ్లు డబ్బులు ఇవ్వరు.. ఉన్నాయి దోచుకుంటారని ధ్వజమెత్తారు. ప్రధాని మోడీకి ఏ విధంగా సాటి రాని రాహుల్ గాంధీ.. దేశ ప్రధాని అయితే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలన్నారు. మాజీ సీఎం కేసీఆర్ మించిన మోసగాడు రేవంత్ రెడ్డని, మోసపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అన్నారు. ఒక్క గ్యారంటీ కూడా ఇప్పుడు వరకు అమలు కాలేదు అన్న విషయాన్ని అందరూ గమనించాలన్నారు. మహబూబ్‌నగర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి డీకే అరుణను భారీ మెజారిటీతో గెలిపించి ఈ ప్రాంతాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
నోటికొచ్చినట్టు మాట్లాడితే చేతిలో ఏనుగు గుడ్లు పెడతారు: ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో రూ.లక్షల కోట్లు ఖర్చుపెట్టి అభివృద్ధి చేపడితే.. ఈ రాష్ట్ర సీఎం, కాంగ్రెస్ పార్టీ నాయకులు గాడిద గుడ్డు చూపుతున్నారని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి అన్నారు. నీ అబద్ధాలకు, నూటికి వచ్చే మాటలకు మీ చేతుల్లో ప్రజలు ఏనుగు గుడ్డు పెడతారంటూ ఎద్దేవా చేశారు. నోటికి వచ్చినట్లు మాట్లాడినందుకే కేసీఆర్‌ను ప్రజలు ఫామ్ హౌజ్‌కు పరిమితం చేశారని గుర్తు చేశారు. రేవంత్ ఇష్టం వచ్చినట్లు వాగితే అతడికి కూడా అదే గతి పడుతుందని స్పష్టం చేశారు. మూడు అడుగులు ఉన్న మనిషికి పార్లమెంటు ఎన్నికలు ముచ్చెమటలు పట్టిస్తున్నాయని కాటిపల్లి అన్నారు.
కోడంగల్.. రేవంత్‌రెడ్డి అడ్డా కాదు : పాలమూరు ఎంపీ అభ్యర్థి డీకే అరుణ
కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం రేవంత్‌రెడ్డి అడ్డానే కాదని.. అతడు రాజకీయాల కోసం కొడంగల్‌కు దత్తత వచ్చాడని డీకే అరుణ ఆరోపించారు. ఈ ప్రాంతం మనదంటూ బీజేపీ పాలమూరు అభ్యర్థి డీకే అరుణ అన్నారు. తమ హయాంలో జరిగిన అభివృద్ధి చెప్పుకుంటూ.. మీరు ఏం చేశారో చెప్పాలని అంటే.. వారు చేసిన అభివృద్ధి గురించి చెప్పకుండా.. తనను మాత్రమే టార్గెట్ చేసుకొని మాట్లాడుతున్నాడంటూ ఆరోపించారు. మరో వారం రోజుల్లో జరిగే పార్లమెంటు ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలిపిస్తే ఈ ప్రాంతాన్ని అన్ని విధాల అభివృద్ధి చెందించి తీరుతా అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బంటు రమేష్, రాజా ప్రభాకర్, ప్రతాప్ రెడ్డి, బీడిల శ్రీకాంత్, కోటకొండ రాము, మద్దూరు బోడ వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.