- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అత్యంత వైభవంగా శోభాయాత్ర చేస్తాము.. ఏం చేసుకుంటారో చేసుకోండి.. సీఎం రేవంత్ రెడ్డికి రాజా సింగ్ వార్నింగ్

దిశ, వెబ్ డెస్క్: బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ (BJP MLA Raja Singh) శ్రీరామ నవమి పండుగ పూట తెలంగాణ ముఖ్యమంత్రికి వార్నింగ్ ఇచ్చారు. ఈ రోజు శ్రీరామ నవమి సందర్భంగా ఎప్పటిలాగే ఓల్డ్ సిటీలో భారీ ఎత్తున శోభాయాత్రను నిర్వహించేందుకు హిందూ సంఘాలు సిద్ధం అయిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) ఈ శోభాయాత్రపై పలు ఆంక్షలు (Restrictions on the procession) విధించింది. దీంతో ఎమ్మెల్యే రాజా సింగ్ (Raja Singh) ప్రభుత్వ నిర్ణయంపై స్పందిస్తూ.. సీరియస్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హిందూ పండగలపై ఆంక్షలు (Restrictions on Hindu festivals) విధించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయిందని విమర్శించారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఇలానే చేస్తున్నారని, ఇండియా కూటమి పార్టీలన్ని హిందువుల పండుగలకు మాత్రమే ఆంక్షలు విధిస్తున్నారని గుర్తు చేశారు. పశ్చిమ బెంగాల్ లో సైతం ఇలానే చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అలాగే ఈ రోజు దూల్ పేట నుంచి కోటీలోని హనుమాన్ వ్యాయామశాల వరకు జరిగే అతి పెద్ద శోభాయాత్రకు సైతం తెలంగాణ పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ రోజు తాను చేపట్టబోయే శోభాయాత్ర సందర్భంగా ఇప్పటికే తనకు పోలీసులు నోటీసులు (Police notices) ఇచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Congress Chief Minister Revanth Reddy)కి ఈ సందర్భంగా తాను ఒక్కటే చెప్పదలుచుకున్నాను, ఎన్ని అడ్డంకలు సృష్టించినా తాము శ్రీరామ నవమి శోభాయాత్ర (Sri Rama Navami procession)ను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని, సీఎం రేవంత్ రెడ్డి ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ రాజా సింగ్ వార్నింగ్ ఇచ్చారు.
కాగా ప్రతి సంవత్సరం హిందూ సంఘాలతో పాటు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (BJP MLA Raja Singh) దూల్ పేటలోని ఆకాష్ పూరి హనుమాన్ టెంపుల్ (Akash Puri Hanuman Temple) నుంచి ర్యాలీని ప్రారంభించి అఫ్జల్ గంజ్ మీదుగా కోఠీలోని హనుమాన్ వ్యాయామశాల వరకు ర్యాలీ నిర్వహిస్తారు. ఈ శోభాయాత్రకు నగరంలోని అన్ని ప్రాంతల నుంచి దాదాపు 3 నుంచి 4 లక్షల వరకు శ్రీరామ భక్తులు (Devotees of Lord Rama), యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. కాగా ఈ మేరకు తెలంగాణ పోలీసులు ఏర్పాటు చేశారు. అయితే ప్రతి సంవత్సరం సాయంత్రం ఈ శోభాయాత్ర జరగనుండగా.. ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ఉదయం 10.30 గంటలకు శోభాయాత్రను ప్రారంభించాలని పోలీసులు హిందూ సంఘాలకు సూచించారు.