- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పిడుగుపాటుకు గొర్రెల కాపరి మృతి

దిశ, గుర్రంపోడు : పిడుగు పడి గొర్రెల కాపరి మృతి చెందిన సంఘటన మండలంలోని అమలూరు గ్రామంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మేకల చిన్న రాములు (60) తను గొర్రెలను మేపుకొని జీవనం సాగిస్తున్నాడు. రోజు మాదిరిగానే గొర్రెలను మేపడానికి వెళ్లిన చిన్న రాములు గురువారం సాయంత్రం గాలి దుమారం, వడగళ్ల తో పాటు ఉరుములు, మెరుపులతో కురిసిన అకాల వర్షానికి చెట్టు కింద తలదాచుకునేందుకు వెళ్లాడు.
రాములు తలదాచుకున్న కొద్ది దూరంలోనే అకస్మాత్తుగా పిడుగు పడటంతో.. రాములు అక్కడికక్కడే మృతి చెందాడు. రాములుకు కొద్ది దూరంలో ఉన్న చిన్న కుమారుడు నరసింహ అతని దగ్గరికి వెళ్లే లోపే విగత జీవిగా కనిపించాడు. పిడుగుపాటుకు గొర్రెల కాపరి మృతిచెందడం తో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడి పెద్ద కుమారుడు మేకల సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పసుపులేటి మధు తెలిపారు.