Heavy Rain: విజయవాడలో కుండపోత వర్షం.. రోడ్లపై కూలిన హోర్డింగ్స్, చెట్లు

by Shiva |
Heavy Rain: విజయవాడలో కుండపోత వర్షం.. రోడ్లపై కూలిన హోర్డింగ్స్, చెట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న విజయవాడ నగరవాసులకు బిగ్ రిలీప్ లభించింది. మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో భారీ ఈదరుగాలులతో కూడిన వర్షంతో పట్టణంలోని పలు రహదారులు అన్ని జలమయమయ్యాయి. పెద్ద ఎత్తున ఉరుములతో కూడిన వర్షం పలుచోట్ల బీభత్సం సృష్టించింది. దీంతో సిటీలో పలుచోట్ల పెద్ద పెద్ద హోర్డింగ్స్‌, చెట్లు నెల కూలాయి. ఈ పరిణామంతో అక్కడక్కడ ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. భారీ వర్షానికి ఆయా ప్రాంతాలు చెరువులు, కుంటలను తలపిస్తున్నాయి. రోడ్లపై ఎక్కడికక్కడ నీరు నిలవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Advertisement

Next Story