- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’..అన్ని జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిక
దిశ, నేషనల్ బ్యూరో: కేరళ రాష్ట్రంలో కొత్త రకం జ్వరం ప్రజలను భయపెడుతోంది. రాష్ట్రంలోని త్రిసూర్, మలప్పురం, కోజికోడ్ జిల్లాల్లో ఈ వైరల్ ఫీచర్ కేసులు నమోదయ్యాయని కేరళ ప్రభుత్వం మంగళవారం తెలిపింది. అన్ని జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. వెస్ట్ నైల్ అనేది వైరల్ ఫీవర్. క్యూలెక్స్ దోమ ద్వారా ఇది మనుషులకు సంక్రమిస్తుందని, దీనికి ఇప్పటివరకు ఎలాంటి ఔషధాలు, వ్యాక్సిన్ లేదని సంబంధిత అధికారులు తెలిపారు. లక్షణాల ద్వారా దీనికి చికిత్స అందించడం, వ్యాధి నిరోధక జాగ్రత్తలు పాటించడం మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎవరైనా జ్వరం లేదా వెస్ట్ నైల్ ఇన్ఫెక్షన్ లక్షణాలు కనిపిస్తే వెంటనే చికిత్స పొందాలని మంత్రి కోరారు. వెస్ట్ నైల్ ఇన్ఫెక్షన్ ప్రధాన లక్షణాలు తలనొప్పి, జ్వరం, కండరాల నొప్పులు, తల తిరగడం, జ్ఞాపకశక్తి కోల్పోవడం అని చెప్పారు. అయితే, ఎక్కువమందిలో ఈ లక్షలు కనిపించకపోవచ్చు. కేవలం 1 శాతం కేసుల్లోనే మెదడు దెబ్బతినే ప్రమాదం ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు. 1937లో మొదటిసారిగా దీన్ని ఉగాండాలో గుర్తించారు. దేశంలో తొలిసారి 2011లో కేరళ రాష్ట్రంలో ఆరేళ్ల బాలుడికి సోకింది. ఆ అబ్బాయి 2019లో జ్వరం కారణంగా మృతి చెందాడు.