తడిసిన ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు: మంత్రి జగదీశ్ రెడ్డి

by Shyam |
తడిసిన ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు: మంత్రి జగదీశ్ రెడ్డి
X

దిశ, నల్లగొండ: అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని, కాబట్టి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. ఇందుకోసం రైస్ మిల్లర్లతో అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారన్నారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ యాదాద్రి జిల్లాలో ఇప్పటివరకు 278 కొనుగోలు కేంద్రాల ద్వారా లక్ష మెట్రిక్ టన్నుల పైగా ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. ఇప్పటికే రైతులకు రూ. 7.62 కోట్లు చెల్లించిట్టు తెలిపారు. గన్నీ బ్యాగుల విషయంలో ఆందోళన వద్దని, సరిపడా ఉన్నాయన్నారు. కలెక్టర్ అనితా రాంచంద్రన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, గాదరి కిశోర్ కుమార్, చిరుమర్తి లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

tags : govt will purchase wet rice, no worries, minister jagadish reddy, sudden rain

Advertisement

Next Story

Most Viewed