మూస పద్దతికి స్వస్తి పలకండి : జ‌గ‌దీష్‌రెడ్డి

by Shyam |
మూస పద్దతికి స్వస్తి పలకండి : జ‌గ‌దీష్‌రెడ్డి
X

మూసపద్దతిలో చేస్తున్న వ్యవసాయానికి స్వస్తి పలికి ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి రైతుల‌కు సూచించారు. శుక్ర‌వారం కాళేశ్వ‌రం ఆయ‌క‌ట్టు ప‌రిశీల‌న‌లో భాగంగా జల్మలకుంట తండా, చిన్నసీతారం, పెద్ద సీతారాం, న్యూ బంజారాహిల్స్, వేల్పుల కుంటతండా రైతులతో ముచ్చ‌టించారు. ఆరుగాలం కష్టపడి చేస్తున్న వరిపంటకు అంతిమంగా ఎకరాకు 15 వెలకంటే ఎక్కువ గిట్టుబాటు కావడం లేదన్న అంశాన్ని రైతాంగం గుర్తించాలని ఆయన ఉపదేశించారు. అందుకు ప్రత్యామ్నాయంగా ఫామాయిల్, కూరగాయల వంటి పంటలపై దృష్టి సారిస్తే అధిక లాభాలు ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. లాభసాటి పంటలపై రైతులకు అవగాహన కల్పించేందుకు గాను త్వరలో సదస్సులు నిర్వహించనున్నట్టు ఆయన వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed