- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ ముందుచూపు.. అమ్మవారి ఆశీస్సుల వల్లే ఇదంతా..!
by Shyam |
X
దిశ, తెలంగాణ బ్యూరో : ఆషాఢమాసం బోనాల జాతర ఉత్సవాల్లో భాగంగా పాతబస్తీలోని లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారికి దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ బోనాల ఉత్సవాలకు అధిక నిధులు కేటాయించి ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ ముందుచూపు, అమ్మవారి దయ వల్ల రాష్ట్రం సుభిక్షంగా ఉందని సకాలంలో వర్షాలు కురిసి, పంటలు సమృద్ధిగా పండుతున్నాయన్నారు.
అంతకుముందు మీరాలం మండి శ్రీ మహంకాళేశ్వర అమ్మవారిని, శాలిబండలోని అక్కన్న మాదన్న, అనంతరం చార్మినార్ భాగ్యలక్ష్మి, అంబర్‌పేట్ మహంకాళి అమ్మవార్లను దర్శించి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు.
Advertisement
Next Story