లాక్‌డౌన్ సమయంలో రోడ్డెక్కిన మంత్రి.. ఎందుకంటే?

by Aamani |   ( Updated:2023-10-10 15:57:26.0  )
లాక్‌డౌన్ సమయంలో రోడ్డెక్కిన మంత్రి.. ఎందుకంటే?
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ అమలు తీరును అటవీ, పర్యావరణ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు. బుధవారం నిర్మల్‌ పట్టణంలో లాక్‌డౌన్‌, ప్రభుత్వం సడలింపు ఏవిధంగా అమలవుతున్నాయని ఆయన అధికారులతో కలిసి పర్యవేక్షించారు. వర్తకులు, చిరువ్యాపారుల ను కలిసి ప్రజలు నిబంధనలు పాటించేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఈ సమయంలో లాక్ డౌన్ నియమాలు అమలు పరచటంలో భాగంగా రోడ్లపై విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్త తీసుకోవాల్సిందిగా సూచిస్తూ లాక్ డౌన్ నియమాలు కఠినంగా అమలు చేయాలని తెలిపారు.

ప్రజలు అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని, ఒకవేళ తప్పనిసరిగా బయటకు రావాల్సిన వస్తే చేతికి గ్లౌజులు ధరిస్తూ, ముఖానికి తప్పనిసరిగా మాస్క్ ను ధరించాలని, సామాజిక దూరం పాటిస్తూ, తమ కావలసిన వస్తువులు తీసుకుని వెంటనే ఇంటికి వెళ్లిపోవాలని తెలిపారు. లాక్ డౌన్ నియమాలు అమలు పరచడంలో పోలీసులకు సహకరించవలసిందిగా ప్రజలను కోరారు. అనంతరం నిర్మల్ పట్టణంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను కూడా పరిశీలించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెంట మున్సిపల్‌ చైర్మన్‌ ఈశ్వర్‌, పోలీస్, ఇతర శాఖ అధికారులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed