ఎంతో తృప్తినిస్తోంది : హరీశ్

by Ramesh Goud |
ఎంతో తృప్తినిస్తోంది : హరీశ్
X

ముస్లీంల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు బుధవారం జిల్లా కేంద్రంలోని హజ్‌హౌస్‌లో ఇటీవల ఉమ్రా యాత్రకు వెళ్లి తిరిగివచ్చిన యాత్రికులకు ఆయన సన్మానించి మాట్లాడారు.. రంజాన్ పండుగకు ఉచితంగా నిరుపేదల ముస్లీంల కోసం కానుకగా దుస్తులను అందిస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ అన్నారు. ప్రతి సంవత్సరం తన సొంత డబ్బులతో నిరుపేద ముస్లింలకు ఉమ్రాకు పంపడం ఎంతో తృప్తిని కలిగిస్తోందన్నారు. వచ్చే ఏడాది మెదక్ ఉమ్మడి జిల్లాలోని సిద్దిపేట మెదక్ సంగారెడ్డి చెందిన నిరుపేద ముస్లీంలకు తన సొంత డబ్బులతో పంపిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ముస్లీం విద్యార్థులు నాణ్యమైన విద్యను అభ్యసించాలని లక్ష్యంతో సీఎం కేసీఆర్ మైనార్టీ గురుకులాలు ఏర్పాటు చేసి సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు. మైనార్టీ గురుకుల లో ఇంగ్లీష్ మీడియం విద్యతో పాటు నమాజునూ చదువు ఇస్తున్నామన్నారు. చలికాలం దృష్ట్యా సిద్దిపేటలోని గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థుల కోసం నాలుగువేల స్వెటర్లు దుప్పట్లను పంపిణీ చేశామని తెలిపారు. గురుకుల పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థికి లక్ష నుంచి లక్ష యాభై వేల వరకు ఖర్చు చేస్తున్నామన్నారు జిల్లా వ్యాప్తంగా మైనార్టీ గురుకులలో చాలామంది విద్యార్థులు లేక ఖాళీలు ఉన్నాయని ముస్లీం మత పెద్దలు అంతా సమిష్టిగా కృషిచేసి విద్యార్థులను గురుకులాల్లో చేర్పించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉర్దూ మీడియం టీచర్స్ కొరత ఉందని సీఎం కేసీఆర్ దీనిపై ప్రత్యేక దృష్టి సారించి త్వరలోనే ఉర్దూ మీడియం టీచర్లను భర్తీ చేయాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి అతి త్వరలోనే నోటిఫికేషన్ జారీ కానుందన్నారు. రాష్ట్రంలోనే హైదరాబాద్ తర్వాత మొదటి హజ్ భవనాన్ని సిద్దిపేటలోని నిర్ణయించుకున్నామన్నారు. ఈ భవనంలో మొదటిది కార్యక్రమం యాత్రికులకు పంపడం ఎంతో సంతోషంగా ఉందన్నారు సిద్దిపేట హజ్ భవన్ జిల్లాలోని ముస్లీం అందరికీ ఉపయోగపడాలన్నారు. నెల రోజులు మాత్రమే హజ్ యాత్రికులకు ఈ భవనం ఉపయోగపడుతుందని 11 నెలల క్రితం వివిధ సేవా కార్యక్రమాలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి వచ్చే సేవలను జిల్లాలోని ముస్లీంలంతా ఈ భవనంలో అందుకోవాలన్నారు. సిద్దిపేటలో ప్రారంభమయ్యే ప్రతి మంచి కార్యక్రమం ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా నిలుస్తూ వస్తుందన్నారు. గతంలో ఇక్కడ ప్రారంభించుకున్న ఆఖరి సఫర్ వాహనం ఇతర ప్రాంతాల్లో సైతం ప్రారంభించనున్నారని తెలిపారు. ప్రతి విద్యార్థి కష్టపడి చదువుకోవాలన్నారు. చదువుతోనే సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని అలాగే పేదరిక నిర్మూలన సైతం సాధ్యమవుతుందన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపులో నిరుపేద ముస్లీంలకు చోటు కల్పిస్తామన్నారు.

Advertisement

Next Story