- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
1500 పడకల హాస్పిటల్‌గా గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్
కరోనా వ్యాప్తి నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో 1500 పడకలను ఏర్పాటు చేయనున్నట్టు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. శనివారం అధికారులతో కలసి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను పరిశీలించారు. ఇందులో 3 వేల మందికి సరిపడా నీళ్ళ ట్యాంకులు, 10 లక్షల లీటర్ల నీరు పట్టేలా సంపులు ఏర్పాటు చేయాలన్నారు. శాశ్వత ప్రాతిపదికన పనులు పూర్తిచేయాలని కోరారు. స్టాఫ్‌కు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. రోగులకు భోజనం అందించడానికి క్యాటరింగ్‌కు ఆర్డర్ ఇవ్వాలన్నారు. సెంట్రల్ ఎయిర్ కండిషనర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తొలి మూడు రోజుల్లో మూడు ఫ్లోర్లు, మరో మూడు రోజుల్లో మిగతావి సిద్ధం చేయాలని మంత్రి కోరారు. 20 రోజుల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రజలను కోరారు.
Tags : minister etela rajender, gachibowli, sports complex, 1500 beds, 10 liters water storage, carona