మిహికా లెహెంగా తయారీకి అంత టైమ్ పట్టిందా?

by Anukaran |
మిహికా లెహెంగా తయారీకి అంత టైమ్ పట్టిందా?
X

భల్లాల దేవుడు(రానా) పెళ్లి చేసుకున్నాడు. చాలా తక్కువమంది ఆప్తుల నడుమ ప్రేమికురాలు మిహికా మెడలో మూడుముళ్లు వేసి సొంతం చేసుకున్నాడు. కాగా రామానాయుడు స్టూడియోస్ వేదికగా జరిగిన వివాహ మహోత్సవ కార్యక్రమంలో వధువు మిహికా బజాజ్ గోల్డ్ కలర్ లెహెంగాలో మెరిసిపోగా.. ఆ అందానికి దాసోహం అయ్యానంటూ ప్రశంసలు కూడా కురిపించాడు రానా.

పెళ్లి కూతురు ధరించిన లెహెంగా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవగా.. ఈ డ్రెస్ తయారు చేసేందుకు అక్షరాల 10 వేల గంటలు పట్టినట్లు తెలిపారు డిజైనర్ అనామిక ఖన్నా. పెళ్లిలో సూపర్ ఔట్ ఫిట్‌తో సూపర్ స్టన్నింగ్‌గా కనిపించిన మిహికా.. ఇందుకోసం స్పెషల్ కేరింగ్ తీసుకుందని చెప్పారు. క్రీమ్, గోల్డ్ కలర్ లెహెంగాకు చికాంకరి, గోల్డ్ మెటల్ వర్క్ చేసినట్లు తెలిపారు. దీనికి తగినట్లుగా గోల్డ్ దుపట్టాను ఎంచుకున్నట్లు చెప్పారు.

Advertisement

Next Story