- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మరో 10ఏళ్లు ధోనీ క్రికెట్ ఆడతాడు: హస్సీ
దిశ, స్పోర్ట్స్: టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఆశ్చర్యకరమైన ఆటగాడని, అతనిలో మరో 10ఏళ్లపాటు క్రికెట్ ఆడే సత్తా ఉందని ఆసీస్ మాజీ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్ మైకేల్ హస్సీ అన్నాడు. మైదానంలో ధోనీ సుదీర్ఘకాలం ఆడాలని కోరుకుంటున్నానని, అతని నిర్ణయాలు, ఆట తీరు అమోఘమని ప్రశంసించాడు. సోనీ టెన్ నిర్వహిస్తున్న పిట్ స్టాప్ షోలో పలు విషయాలు వెల్లడించాడు ‘టీమ్ ఇండియా, చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఎంతో కాలంగా క్రికెట్ ఆడుతున్నాడు. మరో పదేళ్ల పాటు అతను ఆడాలని కోరుకుంటున్నా. అది ఎంత వరకు సాధ్యమవుతుందో నాకు తెలియదు. కానీ, సుదీర్ఘకాలం అతడు ఆడితే చూడాలని ఉంది. మైదానంలో అతను ఆటగాళ్లను ప్రోత్సాహించే విధానం, వారి పట్ల అతను కలిగి ఉండే విశ్వాసం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఒత్తిడిలో కూడా ప్రశాంతంగా ఉండటం ఎంతో నచ్చుతుంది. అతడి నిర్ణయాలు నన్ను ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి’ అని హస్సీ ప్రశంసించాడు. ఆసీస్ తరఫున హస్సీ 79 టెస్టులు, 185 వన్డేలు, 38 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 6235, వన్డేల్లో 5442, టీ20ల్లో 721 రన్స్ చేశాడు. రిటైరైన తర్వాత కోచ్‌గా కెరీర్ ప్రారంభించాడు.