Jhansi hospital fire:మెడికల్ కాలేజీ అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి

by Shamantha N |
Jhansi hospital fire:మెడికల్ కాలేజీ అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్ లోని (Uttar Pradesh) ఝాన్సీ మెడికల్ కాలేజీలో(Jhansi hospital fire) జరిగిన అగ్నిప్రమాదంలో 10 మంది నవజాత శిశువులు చనిపోయారు. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ముర్ము(President Murmu) సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ఈ విషాదాన్ని తట్టుకునే శక్తిని ఆ భగవంతుడు బాధిత తల్లితండ్రులకు, కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. గాయపడిన చిన్నారులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. చిన్నారుల మృతి హృదయ విదారకమని మోడీ పేర్కొన్నారు. ప్రధాని మోడీ ఎక్స్‌లో ఒక పోస్ట్ చేస్తూ.. ‘ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ మెడికల్ కాలేజీలో జరిగిన అగ్ని ప్రమాదం హృదయ విదారకం. పిల్లలను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి. ఈ బాధని భరించే శక్తి భగవంతుడు వారికి ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో స్థానిక యంత్రాంగం బాధితులను ఆదుకునేందుకు అన్ని విధాలా కృషి చేస్తోంది’ అని చెప్పుకొచ్చారు

అసలేం జరిగిందంటే?

శుక్రవారం రాత్రి 11.30 గంటల సమయంలో ఝాన్సీలోని మహారాణి లక్ష్మీబాయ్‌ మెడికల్‌ కళాశాలలోని నియోనాటల్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో మంటలు వ్యాపించాయి. దీంతో, పది మంది నవజాత శిశువులు సజీవ దహనమయ్యారు. మంటల వ్యాప్తించడంతో రోగులు, ఆసుపత్రి సిబ్బంది ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. తమ ప్రాణాలు రక్షించుకోవడానికి బయటకు పరుగులు పెట్టారు. ఈక్రమంలో స్వల్ప తొక్కిసలాట చోటుచేసుకుంది. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే మంటలు చేలరేగి ఉంటాయని ఝాన్సీ జిల్లా కలెక్టర్‌ అవినాశ్‌కుమార్‌ తెలిపారు. జిల్లా యంత్రాంగమంతా ఆసుపత్రికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తోంది. ఇకపోతే, ఈ ఘటనపై యూసీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన చిన్నారుల కుటుంబాలకు పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు తక్షణం రూ.5 లక్షలు, తీవ్రంగా గాయపడిన చిన్నారులకు రూ.50 వేలు చొప్పున సాయం అందించాలని సీఎం యోగి ఆదేశించారు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే డిప్యూటీ సీఎం బ్రిజేష్‌ పాఠక్‌, హెల్త్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ మెడికల్‌ కాలేజీకి చేరుకున్నారు. అక్కడి పరిస్థితులను సమీక్షించారు. ఈ ఘటనపై 12 గంటల్లోగా నివేదిక అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed