కేటీఆర్‌ ట్వీట్‌కు స్పందించిన మెట్రో సిబ్బంది

by Shyam |
కేటీఆర్‌ ట్వీట్‌కు స్పందించిన మెట్రో సిబ్బంది
X

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కోవిడ్-19(కరోనా వైరస్) ప్రస్తుతం హైదరాబాద్‌‌కు పాకడంతో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సైతం ఇప్పటికే ప్రెస్‌మీట్ పెట్టి రాష్ర్ట ప్రజలకు ఈ వైరస్‌పై పలు సూచనలు చేశారు. నగరంలోని గాంధీ ఆసుపత్రిలో ఒక బాధితుడు చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేటీఆర్ ట్వీట్టర్ వేదికగా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు ఎక్కువగా ప్రయాణించే మెట్రో రైళ్లలో, బస్సుల్లో, స్టేషన్లను ఎప్పటికప్పుడూ శుభ్రంగా ఉంచాలని సిబ్బంది ఆదేశించారు. ఈ మేరకు వెంటనే స్పందించిన మెట్రో సిబ్బంది శుభ్రతా చర్యలు చేపట్టారు.

Tags: Metro, cleanup, hyderabad, ministers, ktr, rajendar, twitter, ghandi hospital

Advertisement

Next Story