ఎస్‌బీఐతో జట్టు కట్టిన మెర్సిడెజ్ బెంజ్!

by Harish |
ఎస్‌బీఐతో జట్టు కట్టిన మెర్సిడెజ్ బెంజ్!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్ దేశీయ అతిపెద్ద ప్రభుత్వ యాజమాన్య స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. తమ వినియోగదారులకు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో పాటు ఇంకా అనేక ఇతర ప్రయోజనాలను కల్పించనుంది. అంతేకాకుండా, ఎస్‌బీఐ యోనో ద్వారా కార్లను కొనుగోలు చేసేవారికి అదనంగా ప్రయోజనాలు లభించనున్నాయి. తమ కంపెనీ లగ్జరీ కార్లను బుక్ చేసుకున్న ఎస్‌బీఐ కస్టమర్లకు తక్కువ వడ్డీతో కార్ల ఫైనాన్స్, ఇతర ఆర్థిక ప్రయోజనాలు అందించేందుకు ఈ భాగస్వామ్యం దోహదపడుతుందని మెర్సిడెజ్ బెంజ్ ఓ ప్రకటనలో పేర్కొంది.

బెంజ్ కారును బుక్ చేసుకున్న కస్టమర్లకు డీలర్‌షిప్ వద్ద రూ. 25,000 ప్రయోజనాలు ఉంటాయని, ఈ ఆఫర్ డెసెంబర్ 31 వరకు ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఈ ఏడాది కరోనా ప్రభావంతో లగ్జరీ కార్ల సంస్థ కస్టమర్లను ఆకర్షించేందుకు పలు మార్గాలను అనుసరిస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా ఓ బ్యాంకుతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం తొలిసారి. ఈ ఒప్పందం ప్రకారం..దేశీయంగా 17 సర్కిళ్లలో ఎస్‌బీఐ కస్టమర్లకు బెంజ్ సహకారంతో ఆఫర్లను అందిస్తున్నట్టు ఎస్‌బీఐ రిటైల్, డిజిటల్ ఎండీ సీఎస్ శెట్టి చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed