- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Mercedes-Benz : కొత్తగా రెండు ఎస్‌యూవీలను విడుదల
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ మంగళవారం రెండు ఎస్‌యూవీలను భారత మార్కెట్లో విడుదల చేసింది. జీఎల్ఏ, ఏఎమ్‌జీ జీఎల్ఏ 35 మోడళ్లను తీసుకొచ్చింది. వీటి ప్రారంభ ధర రూ. 42.10 లక్షలుగా నిర్ణయించినట్టు తెలిపింది. ఈ రెండు ఎస్‌యూవీ మోడల్ కార్లు భారత్‌లో అన్ని డీలర్‌షిప్‌లలో లభిస్తాయని, ఆన్‌లైన్ ద్వారా కొనాలనుకునే వారికి కంపెనీ వెబ్ పోర్టల్‌లో లభిస్తుందని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. జీఎల్ఏ మోడల్ ఎస్‌యూవీనీ ఏప్రిల్‌లోనే భారత మార్కెట్లోకి తీసుకురావాలని భావించామని, కరోనా సెకెండ్ వేవ్ వల్ల అంతరాయం కలగడంతో కొంత ఆలస్యంగా తీసుకొచ్చినట్టు కంపెనీ వివరించింది.
‘భారత్‌లో తమ కార్లకు డిమాండ్ పెరుగుతోందని, ఈ నేపథ్యంలోనే కస్టమర్లకు అనుగుణంగా ఈ రెండు కొత్త ఉత్పత్తులను విడుదల చేస్తున్నట్టు కంపెనీ తెలిపింది. ‘కరోనా సెకెండ్ వేవ్‌ను దృష్టిలో ఉంచుకుని కస్టమర్ల ఆరోగ్య, భద్రతకు ప్రాధాన్యత కల్పిస్తూ, తమ ఉత్పత్తుల విక్రయాలను కొనసాగిస్తున్నామని మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ మార్టిన్ ష్వెంక్ చెప్పారు. కరోనా సెకెండ్‌తో లాక్‌డౌన్ ఆంక్షలు ఉన్నందున, త్వరలో ఈ కొత్త ఎస్‌యూవీల డెలివరీలు ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఈ ఏడాదిలో 15 కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురావాలని లక్ష్యంగా ఉంది. ఇప్పటివరకు 6 మోడళ్లను ప్రవేశపెట్టింది.