- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
3 రోజులు ముందే రహస్యంగా.. మేఘన్ మార్కెల్ ఇంటర్వ్యూలో సంచలన విషయాలు
న్యూఢిల్లీ : ప్రముఖ వ్యాఖ్యాత ఓప్రా విన్‌ఫ్రే బ్రిటీష్ రాయల్ ప్రిన్స్ ప్రిన్స్ హ్యారీ, ఆయన సతీమణి మేఘన్ మార్కెల్‌లను చేసిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. అందరూ ఊహించినట్టుగానే బ్రిటన్ రాజవంశంపై మేఘన్ మార్కెల్ కీలక వ్యాఖ్యలు చేశారు. వారి పెళ్లి గురించి, పిల్లల గురించిన వివరాలు బయటపెట్టారు. ఓప్రా విన్‌ఫ్రేతో జరిగే ఇంటర్వ్యూ ప్రసారం కాకుండా అడ్డుకునే ప్రయత్నాలు జరగడమే ఈ కార్యక్రమానికి గల ప్రాధాన్యతను వెల్లడిస్తుంది.
అధికారికంగా నిర్వహించిన కార్యక్రమానికి ముందే ప్రిన్స్ హ్యారీ తాను వివాహం చేసుకున్నామని మేఘన్ మార్కెల్ వెల్లడించారు. అధికారికంగా వివాహానికి 3 రోజుల ముందే రహస్యంగా తాము పెళ్లి చేసుకున్నట్టు వివరించారు. 2018 మే 19న వీరి మనువు అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే, దానికి ముందే కాంటర్‌బరీ జస్టిన్ వెల్స్‌బీకి చెందిన ఓ క్రైస్తవ మత గురువు సమక్షంలో పెళ్లి చేసుకున్నామని, జీవితాన్ని కలిసి పంచుకుంటామని వాగ్దానం చేసుకున్నట్టు మేఘన్ తెలిపారు. ఈ విషయం ఎవ్వరికీ తెలియదని అన్నారు. ‘అధికారిక కార్యక్రమం ప్రపంచానికి, కానీ, ముందుగా మాకు మేముగా ఒకటిగా కలిసిపోవాలనుకుంటున్నాం’ అని ఆ గురువుతో చెప్పామని వివరించారు.
నా కుమారుడి రంగుపైనా చర్చ:
బ్రిటీష్ రాజకుటుంబంపై మేఘన్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ తనకు పుట్టబోయే కుమారుడి రంగుపైనా వారు ఆందోళన చెందారని ఈ ఇంటర్వ్యూలో అన్నారు. ఆఫ్రికన్ అమెరికన్ అయిన మేఘన్ ఈ విషయాన్ని చెబుతూ, ‘నేను గర్భవతిగా ఉన్నప్పుడు కలవరపడే విషయాలను విన్నాను. నా సంతానానికి రాజకుటుంబ గౌరవాన్ని ఇవ్వరని, సెక్యూరిటీని ఇవ్వరనే మాటలు నా చెవిన పడ్డాయి. నాకు పుట్టబోయే బిడ్డ రంగుపైనా రాజకుటుంబీకులు ఆందోళనపడ్డారని హ్యారీ ఓ సారి చెప్పారు’ అని వివరించారు. 2019 మే 6న వీరికి కుమారుడు(ఆర్చీ) పుట్టిన సంగతి తెలిసిందే.