వ్యసనాలు వీడితే.. జీవితం నందనవనం : మెగాస్టార్

by srinivas |   ( Updated:2020-06-26 12:01:48.0  )
వ్యసనాలు వీడితే.. జీవితం నందనవనం : మెగాస్టార్
X

దిశ, వెబ్‌ డెస్క్: ఏపీ యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్‌పై మాజీ కేంద్రమంత్రి, మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. శుక్రవారం అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌ పలువురితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అందులో పాల్గొన్న చిరంజీవి మాట్లాడుతూ… నేటి యువత డ్రగ్స్‌కు బానిసై భవిష్యత్తును నాశనం చేసుకుంటోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మత్తుకు బానిసై అందమైన జీవితాన్ని నాశనం చేసుకోవడం మనసును కలిచివేస్తోందని అన్నారు. క్షణికానందం కోసం నిండు జీవితాన్ని పణంగా పెట్టడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. తెలుగు రాష్ర్టాల్లో యువత డ్రగ్స్‌కు బానిస కాకుండా జాగ్రత్త పడాలని, ఏ పనిచేసినా కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. వ్యసనాలు వీడి బాధ్యతగా వ్యవహరిస్తే మీ జీవితం నందనవనం అవుతుందని చిరు అన్నారు. డ్రగ్స్‌కి వ్యతిరేకంగా ప్రచారం చేయటానికి పూనుకున్న డీజీపీ సవాంగ్ నిర్ణయం గొప్పదని ఆయన చెప్పుకొచ్చారు. ఇందుకు సహకారంగా మీటింగ్‌లో పాల్గొన్న అందరినీ స్వాగతిస్తున్నానని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed