- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సూపర్ టాలెంట్.. ఖగోళ శాస్త్రంపై పదేళ్ల బాలుడి పుస్తకం
దిశ, ఫీచర్స్ : కోల్‌కతాకు చెందిన 10 ఏళ్ల రేయాన్ష్ దాస్, ఖగోళ భౌతికశాస్త్రంపై పుస్తకం రాసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఆకాశంలోని చుక్కలు, చందమామను మించి ఆస్ట్రానమీ, ఆస్ట్రో ఫిజిక్స్‌పై ఇష్టం పెంచుకున్న ఆ కుర్రాడు తన పుస్తకంలో సైన్స్, ఖగోళశాస్త్రాల ప్రాముఖ్యతను వివరించాడు.
కోల్‌కతాకు చెందిన రేయాన్ష్ ఏడేళ్ల వయసులోనే ‘లైఫ్ బియాండ్ నంబర్స్’ పేరుతో ఓ పుస్తకం రాయగా, అమెజాన్‌లో గుడ్ రివ్యూస్ పొందింది. ఇదే క్రమంలో మరోసారి తన కలానికి పని చెప్పిన రేయాన్ష్.. తాజాగా ‘ది యూనివర్స్ : ది పాస్ట్, ది ప్రెజెంట్ అండ్ ది ఫ్యూచర్’ అనే పుస్తకంతో ముందుకొచ్చాడు. ఈ పుస్తకంలో బిగ్ బ్యాంగ్ థియరీ, కాంతి వేగం, టైమ్ డైలేషన్, పాజిబుల్ మల్టిపుల్ థియరీస్, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, ఐజాక్ న్యూటన్ మధ్య వ్యత్యాసం, ఫ్యూచర్ ఆఫ్ ది యూనివర్స్, లైఫ్ సైకిల్ ఆఫ్ స్టార్స్, సౌర వ్యవస్థ, నక్షత్ర అవశేషాలు, ద కర్వేచర్, బ్లాక్ మ్యాటర్, బ్లాక్ ఎనర్జీ, స్పేస్ టైమ్ వంటి ఎన్నో అంశాలను వివరించాడు.
కాగా రేయాన్ష్ అందించిన స్పేస్ కాన్సెప్ట్, అతడి ఆలోచన చాలా స్పష్టంగా, అద్భుతంగా ఉందని రీసెర్చ్ స్కాలర్ నందితా రహా వ్యాఖ్యానించారు. ఈ పుస్తకం భౌతిక శాస్త్రవేత్తలను సైతం ఆకట్టుకుంటుండగా.. అమెజాన్ పాఠకులు సైతం ఈ చిన్నోడి ప్రతిభకు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఏడేళ్లకే పుస్తకం రాశాడు..
ఐదేళ్ల ప్రాయం నుంచే రేయాన్ష్ నక్షత్రాలు, గెలాక్సీలు, విశ్వాంతరాల అంశాలపై ఆసక్తి చూపించేవాడు. ఆకాశం వైపు చూస్తూ.. ఆ కాంతి చుక్కలు ఏమిటి? అవి ఎలా ఏర్పడ్డాయి? అక్కడ ఎందుకు ఉన్నాయి? వంటి ప్రశ్నలు వేసేవాడు. ఆ ఆసక్తితోనే వివిధ ఖగోళ పుస్తకాల చదవడంతో పాటు అంతరిక్షానికి సంబంధించిన అనేక వీడియోలు చూస్తూ పెరిగాడు. మాకు భౌతికశాస్త్రంపై పెద్దగా అవగాహన లేకపోవడంతో తనను భౌతికశాస్త్ర నిపుణుల వద్దకు తీసుకెళ్లాం. వాళ్లతో చర్చించి తన సందేహాలు తీర్చుకునేవాడు. అలా ఏడేళ్లకే అప్పటివరకు తను పొందిన జ్ఞానంతో పుస్తకం రాయాలని నిర్ణయించుకున్నాడు.
– రేయాన్ష్ తల్లి సోని
‘నాకు తెలిసిన విషయాలు, నేర్చుకున్న అంశాలను అందరికీ చెప్పాలనే ఉద్దేశంతో ఈ పుస్తకం రాశాను. మన నాగరికతను కొనసాగించడానికి మనం వివిధ గ్రహాలకు విస్తరించాలి. కొత్త టెక్నాలజీలను సృష్టించాలి. లేకపోతే గ్లోబల్ వార్మింగ్, ముంచెత్తే వరదలతో మనం నాశనం అవుతాం. కొన్ని ప్రొఫెషన్స్ అంటే ఇష్టమున్నా, ఆస్ట్రోనాట్ కావాలని అనుకుంటున్నాను. అలా అయితే అంతరిక్షంలోనూ మన అన్వేషణ కొనసాగించొచ్చు. అంగారక, చంద్ర గ్రహాలపై మానవ కాలనీలను స్థాపించడమే నా భవిష్యత్తు ప్రణాళిక’ – రేయాన్ష్