- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నిర్లక్ష్యమా నీకు జోహార్..
దిశ ప్రతినిధి, కరీంనగర్: కరోనా మహమ్మారిని కట్టడి చేయాలంటే స్వీయ నియంత్రణ తప్పనిసరిగా పాటించాల్సిన పరిస్థితి నెలకొంది. ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా ప్రాణాలకే ముప్పు, తస్మాత్ జాగ్రత్త అని చెప్పేవారే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సాధారణ పౌరులెలా అప్రమత్తంగా ఉంటారో వారికే తెలియాలి. ప్రాణాలను ఫణంగా పెడుతూ చికిత్స అందిస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్సే నిర్లక్ష్యంగా వ్యవహరించడం విమర్శలకు దారి తీస్తోంది. సాక్షాత్తు జిల్లా కేంద్రమైన కరీంనగర్‌లో వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగం వ్యవహరించిన తీరు అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. కరీంనగర్‌లోని ఓ వృద్దాశ్రమంలో పలువురికి కరోనా లక్షణాలు కనిపించాయి. వందమంది ఈ ఆశ్రమంలో ఉండగా 25 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు తెలుస్తోంది. వీరికి ర్యాపిడ్ టెస్ట్‌లు చేసేందుకు వైద్య బృందాలు ఆశ్రమానికి వెళ్లి పరీక్షలు నిర్వహించాయి. అయితే వీరి పరీక్షల కోసం నిర్వహించిన పరికరాలను ఆ ఆశ్రమం వద్దే వదిలేసి వెల్లిపోయారు. నిబంధనల ప్రకారం.. వీటిని కాల్చేయాల్సి ఉన్నప్పటికీ వైద్య బృందాలు అక్కడే పడేసి పోవడం గమనార్హం. ఆశ్రమం ముందే టెస్ట్ చేసిన మెడికల్ వేస్టేజీని వైద్య సిబ్బంది వదిలేసి వెల్లిపోవడం గమనార్హం.