హరీశ్ రావు ఎంట్రీతో వైద్య శాఖలో వణుకు

by Anukaran |
harish-rao
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆరోగ్య శాఖ మంత్రిగా హరీశ్ రావు రాకతో అధికారులతో పాటు సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఆ సారు మస్తు స్టిక్ట్ అంటూ డిపార్ట్‌మెంట్‌లో చర్చించుకుంటున్నారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే ఎట్టి పరిస్థితుల్లో సహించరని అలర్ట్ అవుతున్నారు. ఇన్నాళ్లు పెండింగ్‌లో ఉన్న పనులు, ఫైళ్లను పూర్తి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వైద్య శాఖలో ఉన్న సమస్యలు, ఉద్యోగుల ఇబ్బందులను మెడికల్ జేఏసీ మంత్రిని కలిసి వివరించింది. దానికి గల కారణాలను స్పష్టం చేసింది.

దీంతో వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న సమస్యలపై తనకు రిపోర్ట్ రూపంలో ఇవ్వాలని మంత్రి అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా తర్వాత వైద్యశాఖను స్వయంగా సీఎం కేసీఆర్ పర్యవేక్షించారు. వేగంగా కొత్త ప్రాజెక్టులు వస్తున్నప్పటికీ , నేరుగా ఉద్యోగుల సమస్యలు చెప్పుకునేందుకు అవకాశం లేదు. ఇప్పుడు హరీశ్ రాకతో తమకు న్యాయం జరుగుతుందని క్షేత్ర స్థాయి సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed