బొత్స మీటింగ్.. విలేఖరుల నిరసన 

by srinivas |
బొత్స మీటింగ్.. విలేఖరుల నిరసన 
X

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో జిల్లా అభివృద్ధిపై మంత్రులు బొత్స సత్యనారాయణ, శంకర్‌నారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అధికారులు హాజరయ్యారు. డీఆర్సీ సమావేశానికి మీడియాను మంత్రి బొత్స సత్యనారాయణ నిరాకరించారు. దీంతో మీడియాను అనుమతించొద్దని కలెక్టర్‌ గంధం చంద్రుడు ఆదేశాలిచ్చారు. కాగా మీడియాను అనుమతించకపోవడంతో డీఆర్సీ మీటింగ్‌ హాల్‌ ఎదుట మీడియా ప్రతినిధులు బైఠాయించారు. ప్రభుత్వ అనుకూల మీడియా సిబ్బందికి మాత్రమే అనుమతి ఇవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story