బ్రేకింగ్.. మర్రి శశిధర్ రెడ్డి సంచలన నిర్ణయం..

by Shyam |   ( Updated:2021-06-27 07:31:00.0  )
బ్రేకింగ్.. మర్రి శశిధర్ రెడ్డి సంచలన నిర్ణయం..
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి గళం పీక్ స్టేజ్‌కు చేరుతోంది. టీపీసీసీ పదవి రేవంత్ రెడ్డికి ఇవ్వడంతో కాంగ్రెస్ సీనియర్ నేతలు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. టీపీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్‌ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి శశిధర్ రెడ్డి లేఖ రాశారు.

అయితే, ఇప్పటికే కాంగ్రెస్ నేతలు అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సైతం అధిష్టానంపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. గాంధీ భవన్ మెట్లు ఎక్కను అంటూ కామెంట్స్ చేశారు.

Advertisement

Next Story