శాంతి చర్చలకు సిద్ధం.. ప్రభుత్వానికి మావోల లేఖ

by Anukaran |   ( Updated:2021-03-17 00:39:48.0  )
శాంతి చర్చలకు సిద్ధం.. ప్రభుత్వానికి మావోల లేఖ
X

దిశ,వెబ్‌డెస్క్: ఛత్తీస్ గఢ్ ప్రభుత్వంతో తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని మావోయిస్ట్ అధికార ప్రతినిధి వికల్ప్ పేరుతో బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే తాము విధించిన మూడు షరతులకు ఒప్పుకుంటే శాంతి చర్చలకు రావాలని ఛత్తీస్ గఢ్ ప్రభుత్వాన్ని కోరారు. ఆ మూడు డిమాండ్లు ఏంటంటే..
♦ దండకారణ్యంలో సాయిధ దళాలను తొలగించాలి.
♦ మావోయిస్ట్ సంస్థలపై విధించిన ఆంక్షల్ని ఎత్తివేయాలి.
♦ జైళ్లలో ఉన్న మావోయిస్ట్ నేతల్ని విడుదల చేయాలి అని లేఖలో పేర్కొన్నారు. అందుకు సిద్ధమైతే తమతో చర్చించాలని ఛత్తీస్ గఢ్ ప్రభుత్వానికి సూచించారు.

Advertisement

Next Story