లొంగిపోయిన మావోయిస్టు నేత శారదక్క.. కారణం అదేనా..?

by Shyam |   ( Updated:2021-09-17 02:39:14.0  )
లొంగిపోయిన మావోయిస్టు నేత శారదక్క.. కారణం అదేనా..?
X

దిశ, కొత్తగూడ: కొన్ని రోజులుగా జరుగుతోన్న ప్రచారానికి నేటితో తెర పడనుంది. మావోయిస్టు నేత శారదక్క పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు విశ్వసనీయ సమాచారం. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బజ్జర సమ్మక్క అలియాస్ శారదక్క శుక్రవారం ఉదయం డీజీపీ మహేందర్‌రెడ్డి ఎదుట లొంగిపోయారు. శారద స్వస్థలం మహబూబాబాద్‌ జిల్లాలోని గంగారం. పీపుల్స్‌వార్‌ పార్టీకి ఆకర్షితురాలైన శారద 1994లో అజ్ఞాతంలోకి వెళ్లారు. ప్రస్తుతం జిల్లా కమిటీ సభ్యురాలిగా పని చేస్తున్నారు. గతంలో చర్ల-శబరి ఏరియా కమిటీ కార్యదర్శిగా సైతం పనిచేశారు. కాగా, శారదక్క భర్త అయిన మావోయిస్టు నేత హరిభూషణ్ ఈ ఏడాది జూన్‌ 21న కరోనాతో చనిపోయారు. ఇదిలా ఉండగా శుక్రవారం మధ్యాహ్నం శారదక్క లొంగుబాటుకు సంబంధించిన వివరాలను డీజీపీ మహేందర్‌ రెడ్డి మీడియాకు వెల్లడించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed