- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మోదీ శ్రద్ధ వహించాలి: మన్మోహన్
న్యూఢిల్లీ: దేశ ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా సరైన పదాలను వినియోగించాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సూచించారు. ప్రధాని చేసిన వ్యాఖ్యలను చైనా తనకు అనుకూలంగా మార్చుకునే ప్రమాదమున్నదని హెచ్చరించారు. అలా మాట్లాడొద్దని మన్మోహన్ ఓ ప్రకటనలో తెలిపారు. సరిహద్దు ఘర్షణలపై ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో భారత సరిహద్దులోకి ఎవ్వరూ చొరబడలేదని, ఒక్క అంగుళం కూడా ఎవరి స్వాధీనం కాలేదని, భారత పోస్టులన్నీ క్షేమంగానే ఉన్నాయని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా దుమారం రేగింది. ప్రస్తుతం చైనా బలగాలున్న ప్రాంతం భారత భూభాగం కాదా? మన సైనికులు మన భూభాగంలో చనిపోయారా? వారి భూభాగంలో చనిపోయారా? చైనా ఆర్మీ మనదేశంలోకి చొరబడ్డ కారణంగానే ఘర్షణలు చోటుచేసుకున్నాయని మనదేశ విదేశాంగ శాఖ చేసిన ప్రకటన అబద్ధమా? వంటి అనేక ప్రశ్నలు వెలువడ్డాయి.
ఈ నేపథ్యంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తాజాగా స్పందించారు. సరిహద్దులో మరణించిన 20 మంది జవాన్ల ప్రాణ త్యాగాలకు సరైన న్యాయం చేయాలని, ప్రధాని సహా ప్రభుత్వ ప్రతి అంగం ఇందుకు కట్టుబడి పనిచేయాలని సూచించారు. ప్రధాని తను చేసే వ్యాఖ్యలపై అప్రమత్తంగా ఉండాలని, దేశ భద్రత, సమగ్రత, భూభాగాలపై మాట్లాడేటప్పుడు మరింత శ్రద్ధ వహించాలని తెలిపారు. చైనా బెదిరింపులకు తలొంచద్దని, మన దేశ భౌగోళిక సమగ్రతపై వెనుకడుగు వేయవద్దని పేర్కొన్నారు. చైనా దుందుడుకు చర్యలపైనా ఆయన మండిపడ్డారు. చైనా బెదిరింపులను తిప్పికొట్టేందుకు దేశమంతా ఒక్కటిగా నిలవాల్సిన తరుణం ఆసన్నమైందని తెలిపారు. చైనా అనుకూలంగా మార్చుకుని వాదనకు దిగే ఆస్కారమిచ్చే విధంగా ప్రధాని వ్యాఖ్యలు చేయొద్దని మరోసారి సూచించారు.