కరోనా వ్యాక్సిన్ తీసుకున్న అంగన్ వాడీ కార్యకర్త.. అంతలోనే మరణం

by Anukaran |
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న అంగన్ వాడీ కార్యకర్త.. అంతలోనే మరణం
X

దిశ,వెబ్‌డెస్క్: మణిపూర్‌లో 48 ఏళ్ల అంగన్‌వాడీ కార్యకర్త తన తొలి మోతాదు కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారం రోజులకే మరణించింది. బిష్ణుపూర్ జిల్లా కుంబి ప్రాంతానికి చెందిన సుందరి దేవి ఫిబ్రవరి 12 న కువి ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా వ్యాక్సిన్ ను తీసుకున్నారు. అయితే ఫిబ్రవరి 18న ఆమె అస్వస్థతకు గురి కావడంతో అత్యవసర చికిత్స కోసం మొయిరాంగ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కి తరలించారు. ఈ నేపథ్యంలో చికిత్స పొందుతూ మరణించింది. బాధితురాలి మరణంపై స్పందించిన జిల్లా ఆరోగ్యశాఖ అధికారులు మాట్లాడుతూ.. దేవికి శ్వాస కోస సమస్యలున్నాయని, అందుకే ఆమె మరణించినట్లు తెలిపారు.

మరోవైపు మణిపూర్ సీఎం బీరెన్ సింగ్.., దేవి మరణంపై ఆమె కుటుంబసభ్యులతో భేటీ అయ్యారు. ఈ భేటీలో బాధిత కుటుంబానికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. పోస్టుమార్టం నివేదికలను పరిగణనలోకి తీసుకొని తగిన పరిహారం ఇస్తానని హామీ ఇచ్చారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేశారు. బిష్నుపూర్ డిప్యూటీ కమిషనర్ నీతా అరంబామ్ మాట్లాడుతూ, టీకాలు వేసే సమయంలో దేవి “తనకు అలెర్జీ సమస్య ఉందని టీకా బృందానికి చెప్పారు. అయినా దేవికి టీకా వేసినట్లు బాధితురాలు బంధువులు చెప్పినట్లు డీసీపీ నీతా తెలిపారు.

Advertisement

Next Story