అధికారంలోకి రావడం పెద్ద కష్టమేం కాదు !

by Shyam |
అధికారంలోకి రావడం పెద్ద కష్టమేం కాదు !
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్‌లో మంచి నాయకులు ఉన్నారని, పార్టీని అధికారంలోకి తేవడం పెద్ద కష్టమేం కాదని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్కం ఠాగూర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా నేతలందరూ కలిసి పనిచేస్తే 2023లో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ పటిష్ఠంగా ఉండాలంటే నేతల మధ్య ఐక్యత ఉండాలని, కొత్త, యువ నాయకత్వం ఎప్పుడూ వస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. పీసీసీ అధ్యక్షుడి మార్పుపై నేనేం చెప్పలేనని, అధిష్ఠానానిదే తుది నిర్ణయమని స్పష్టం చేశారు.

Advertisement

Next Story