- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వికీపీడియాతో ఇబ్బందిపడ్డ యాక్ట్రెస్.. రక్తం మరిగిపోయిందంటూ స్టేట్‌మెంట్
దిశ, సినిమా : యాక్టర్, ప్రజెంటర్ మందిరా బేడీ ఈ రోజు(గురువారం) 49వ పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా వయసు గురించి గతంలో తనకు ఎలాంటి ఆలోచనలు ఉండేవో తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది. 30 ఏళ్ల వయసులో తన ఏజ్ ఎంత అనేది వికీపీడియాలో స్పష్టంగా కనిపిస్తుండటంతో చాలా వర్రీ అయిపోయేదాన్నని, ఆ సీక్రెట్ ఎలా దాచిపెట్టాలో అర్థం కాకపోయేదని చెప్పింది. ఆ టైమ్‌లో వికీలో తన ఏజ్ చేంజ్ చేసేందుకు తనకు స్ట్రాంగ్ పీఆర్ టీమ్ కూడా లేదని వెల్లడించింది. కానీ 40 ఏళ్లు వచ్చేసరికి ఈ అనవసరపు ఆలోచనలకు విముక్తి లభించిందని తెలిపింది. అప్పుడు తాను తానుగా, రియలిస్టిక్‌గా ఉండటాన్ని ప్రజలు అభినందిస్తున్నారని గ్రహించానని.. ఇక అప్పటి నుంచి తన ఏజ్ అందరికీ తెలిసిపోతుందనే భయం కానీ, దాచాల్సిన అవసరం కానీ రాలేదని చెప్పింది. తాను నేచురల్‌గా ఉండేందుకే ప్రయత్నిస్తానని, యంగ్‌గా కనిపించేందుకు ఆర్టిఫిషియల్ ట్రీట్మెంట్స్, సర్జరీల జోలికి వెళ్లనన్న మందిర.. ముఖంపై ముడతలు తీసేసుకునేందుకు బొటాక్స్, ఫిల్లర్స్ లాంటి పద్ధతులను అస్సలు ఫాలో కానని స్పష్టం చేసింది. నుదుటిపై ముడతలు ఏజ్‌తో పాటు రావడం మామూలే కదా! అని అభిప్రాయపడింది.
ఇక తన కూతురు తార గురించి సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ చూసి రక్తం మరిగిపోయిందని తెలిపిన మందిర.. అసలు ప్రపంచం గురించి ఏమీ తెలియని పాపను ‘స్ట్రీట్ డాగ్, స్లమ్‌డాగ్ సెంటర్’ అని కామెంట్ చేయడంపై ఫైర్ అయింది.