పూరీ సినీ ప్రయాణం… ఇండస్ట్రీకి పాఠాలు నేర్పింది: మనోజ్

by Jakkula Samataha |
పూరీ సినీ ప్రయాణం… ఇండస్ట్రీకి పాఠాలు నేర్పింది: మనోజ్
X

డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్… ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన బద్రి సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అయిన ఆయన… తొలి సినిమాతోనే హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత ఆయన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ లు. ముఖ్యంగా మహేష్ బాబు హీరోగా వచ్చిన పోకిరి సినిమా ఇండస్ట్రీ రికార్డు. తాజాగా ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న పూరీ… ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. నిజానికి పూరీ… జీరోను హీరో చేయగలడు. ఫ్లాప్ లు ఉన్న హీరోకు హిట్ ఇచ్చి నిలబెట్టగలడు. అసలు పూరీ హీరో అంటేనే ఓ రేంజ్ ఉంటది. ఆటిట్టూడ్, వెటకారం, ఈగో ఎక్కువ ఆయన హీరో క్యారెక్టర్ కు. అందుకే హీరోల కెరీర్ పూరీ సినిమాకు ముందు ఆ తర్వాత అన్నట్లుగా ఉంటుంది. అంటే పూరీ సినిమా చేస్తే… స్టార్ హీరో రేంజ్ దక్కడం ఖాయం. అందుకే హీరోలు ఆయన డైరెక్షన్ లో సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు.

అయితే పూరీ సినిమాల్లో హీరోలకు వెటకారం ఎక్కువే కానీ… పూరీ మనసు మాత్రం వెన్న అంటున్నాడు మంచు మనోజ్. పూరీ ఇండస్ట్రీలో 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అభినందనలు తెలుపుతూ పోస్ట్ పెట్టిన మనోజ్… పూరీ చాలా కష్టపడే వ్యక్తి అని… చాలా ఫ్రెండ్లీగా ఉండే పూరీ .. ప్రోత్సహించడం లో ముందుంటాడు అని తెలిపాడు. పూరీ 20 ఏళ్ల సినీ ప్రయాణం .. ఇండస్ట్రీకి కళా నైపుణ్యం, అంకితభావం, కృషి, పట్టుదలను నేర్పిందన్నారు. సార్ మీ గురించి ఇంకా ఏం చెప్పగలం…మాస్ మూవీ లవర్స్ గా మీ సినిమాలకు చీర్స్ చెప్తూ విజిల్స్ కొడుతూ ఎంజాయ్ చేయడం తప్పా… మీ నుంచి మరిన్ని పక్కా మాస్ మసాలా కమర్షియల్ మూవీస్ రావాలని కోరుకుంటున్నాను. గ్రేట్ వర్క్ చేస్తున్న మీకు ఆ దేవుడి ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. ఎప్పటిలాగే ప్రేమ, సంతోషాన్ని పంచాలని కోరుకుంటున్నట్లు చెప్పారు మనోజ్.

దీనిపై స్పందించిన పూరీ .. థాంక్స్ మనోజ్ ..నువు రాసిన మాటలు నా హృదయాన్ని తాకాయి… లవ్ యూ అంటూ ట్వీట్ చేయగా… నీ కన్న ఎక్కువ లవ్ చేస్తున్నా అంటూ రిప్లై ఇచ్చాడు మనోజ్.

Tags : Manchu Manoj, Puri Jagannath, Tollywood, Social Media

Advertisement

Next Story

Most Viewed