- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అంతర్ జిల్లా నేరస్తుడు అరెస్ట్
దిశ, మంచిర్యాల: జల్సాలకు అలవాటు పడి వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా నేరస్తుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంచిర్యాల జిల్లా రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలోని బెల్లంపల్లిలో సోమవారం డీసీపీ డి. ఉదయ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాశీపేట మండలం పెద్దనపల్లికి చెందిన బండ సంపత్‌కు 9 ఏళ్ల వయస్సులో తల్లిదండ్రులు చనిపోయారు. అప్పటి నుంచి వరుసకు అత్త అయిన బండారి లక్ష్మితో పెరిగాడు. ఈ క్రమంలో జల్సాలకు అలవాటు పడి డబ్బుల కోసం దొంగతనాలు చేస్తూ.. అట్టి దొంగ సొత్తును బండారి లక్ష్మికి అమ్మడానికి ఇచ్చేవాడు. దొంగతనాల కేసుల్లో పలుమార్లు జైలుకు వెళ్లి బెయిల్‌పై విడుదలయ్యాడు.
ఈ క్రమంలో దొంగతనం చేసిన సొమ్మును అమ్మేందుకు ఈ నెల 27వ తేదీన బెల్లంపల్లి బజార్‌కు వెళ్లేందుకు ఆటో కోసం చూస్తుండగా.. పోలీసులు అతన్ని పట్టుకుని విచారించారు. దీంతో సంపత్ ఇచ్చిన సమాచారం మేరకు సోమగూడెంలోని తన అత్త బండారి లక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. బండ సంపత్ నుంచి 21 తులాల బంగారం, 18 తులాల వెండి స్వాధీనం చేసుకున్నారు. నిందితులను ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నేరస్తులను పట్టుకున్న పోలీసు అధికారులను మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి నగదు పురస్కారంతో అభినందించారు.