చాక్లెట్ కోసం చంపేశాడు  

by Anukaran |
చాక్లెట్ కోసం చంపేశాడు  
X
దిశ, వెబ్ డెస్క్: బీహార్ లోని మధుబని జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చిన్న పిల్లాడిని చాక్లెట్ దొంగతనం చేశాడని చావగొట్టారు. కనికరం లేకుండా చెట్టుకి కట్టేసి చితకబాది చంపేశారు. ఈ అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసుల కథనం ప్రకారం.. మధుబని పరిధిలోని హర్లాకీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సోఠ్‌గావ్‌ గ్రామానికి చెందిన అహ్మద్(13) తండ్రి సబ్బుల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అహ్మద్ ఇంటి బయట ఆడుకుంటుండగా.. ఇంతలో అక్కడికి సమీపంలో దుకాణం నిర్వహిస్తున్న కాసిమ్ అక్కడికి వచ్చాడు. చాక్లెట్ దొంగతనం చేశావంటూ… ఆ బాలుడిని పట్టుకుని స్తంభానికి కట్టేసి చావబాదాడు.
ఈ ఘటనలో అహ్మద్ అక్కడికక్కడే మృతి చెందాడు. బాలుడు చనిపోవడంతో… కాసిమ్ ఆ బాలుడి మృతదేహాన్ని అతని ఇంటివద్దే వదిలేసి పారిపోయాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఈ ఉదంతంపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సిద్ధపడ్డారు. అయితే, ఆ ప్రాంతానికి చెందిన కొంతమంది మత పెద్దలు బాలుని మృతదేహాన్ని రహస్యంగా భూమిలో పాతిపెట్టారు. తరువాత మృతుని కుటుంబ సభ్యులను ఇంటి నుంచి వెళ్లిపొమ్మని హెచ్చరించారు.
ఈ ఘటన జరిగిన మూడు రోజుల తరువాత మృతుని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగు చూసింది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాలుడి మృతదేహాన్ని వెలికి తీసి పంచనామా నిర్వహించారు. పరారీలో ఉన్న నిందితుడు కాసిమ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Advertisement

Next Story