చిన్నారుల కిడ్నాప్, రేప్ కేసులో ట్విస్ట్.. భర్త అత్యాచారాల వెనక భార్య..!

by Anukaran |   ( Updated:2021-07-13 05:52:19.0  )
jawahar-nagar-crime
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ లో చిన్నారులను కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడుతున్న ఒడిశాకు చెందిన అభిరామ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ లైంగికదాడి కేసు దర్యాప్తులో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. అభిరామ్ ఇలా మారడానికి కారణం ఆమె భార్యేనని తెలిసి పోలీసులు నివ్వెరపోయారు. వివరాలలోకి వెళితే.. ఒడిశాకు చెందిన అభిరామ్ దాస్ అలియాస్ అభి 12 ఏండ్ల క్రితం భార్యతో కలిసి హైదరాబాద్ కి వచ్చాడు. ఇక్కడే చిన్నాచితకా పనులు చేసుకుంటూ బతుకుతుండేవారు. ఈ నేపథ్యంలోనే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడం మొదలయ్యాయి.

ప్రతిసారి భార్య.. నువ్వు సంసారానికి పనికి రావు.. కాపురం చేయడం చేతకాదు అంటూ నిందిస్తుండేది. ఈ గొడవల నేపథ్యంలోనే ఎనిమిదేళ్ల కిందటే అభిరామ్ ను భార్య వదిలేసింది. అప్పటినుంచి అతను కీసర బండ్లగూడలోని ఓ గదిలో అద్దెకుంటూ మేస్త్రీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మత్తు పదార్థాలకు బానిసగా మారిన అభిరామ్ తన కామవాంఛ తీర్చుకునేందుకు చిన్నారులను లక్ష్యంగా చేసుకున్నాడు.

ఇటీవల జూలై 4 న దమ్మాయిగూడ లో ఓ చిన్నారిని కిడ్నాప్ చేసిన అభిరామ్ ఆమెపై లైంగిక దాడి చేసి రెండు రోజుల తర్వాత ప్రగతినగర్ వాటర్ ట్యాంక్ వద్ద వదిలేశాడు. చిన్నారి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. రంగంలోకి దిగిన పోలీసులు అపస్మారక స్థితిలో ఉన్న చిన్నారిని గుర్తించి ఆసుపత్రిలో చేర్పించారు. చిన్నారిపై లైంగిక దాడి జరిగిందని వైద్యులు తెలపడంతో ఈ కేసును పోలీసులు సవాల్ గా తీసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే అభిరామ్ జూలై 9 న మరొక చిన్నారిని కిడ్నాప్ చేయడానికి యత్నించగా ఆమె తల్లి ప్రతిఘటించడంతో పరారయ్యాడు.

ఇక వెంటనే చిన్నారి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసి.. అతడి గుర్తులు చెప్పగా సీసీ టీవీ కెమెరాలను పరిశీలించి ఎట్టకేలకు అభిరామ్ ను అరెస్ట్ చేశారు. విచారణలో తన భార్య తనను వదిలేసి వెళ్లిపోయిందని, తాను సంసారానికి పనికిరానని చెప్పడంతో లైంగిక వాంఛలు తీర్చుకోవడానికి చిన్నారులను కిడ్నాప్ చేస్తున్నట్లు అంగీకరించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని కోర్టు లో హాజరు పరిచారు.

Advertisement

Next Story